"పెద్దనైన నేను, సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయియునకు శుభమని చెప్పి వ్రాయునది."
2
"ప్రియుడా, నీ ఆత్మ వర్థిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు పౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను."
3
"నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి, నీ సత్యప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని."
4
నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు.
5
"ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్ల విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు."
6
వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి.
7
వారు అన్యజనుల వలన ఏమియు తీసి కొనక ఆయన నామము నిమిత్తము బయలు దేరిరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన యెడల నీకు యుక్తముగా ఉండును.
8
మనము సత్యమునకు సహాయకుల మవునట్టు అట్టివారికి ఉపకారము చేయబద్ధులమై యున్నాము.
9
నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియొత్రెఫే మమ్మును అంగీకరించుట లేదు.
10
"వాడు మమ్మును గూర్చి చెడ్ఢ మాటలు వదరుచు, అది చాలనట్టుగా, సహోదరులను తానే చేర్చుకొనక, వారిని చేర్చుకొన మనస్సు గలవారిని కూడ ఆటంక పరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు; అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసికొందును."
11
"ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యము ననుసరించి నడుచుకొనుము. మేలుచేయువాడు దేవుని సంబంధి, కీడుచేయువాడు దేవుని చూచిన వాడు కాడు."
12
దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. మేము కూడ అతనికి సాక్ష్యమిచ్చుచున్నాము; మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదువు.
13
అనేక సంగతులు నీకు వ్రాయవలసియున్నది గాని సిరాతోను కలముతోను నీకు వ్రాయ నాకిష్టము లేదు.
14
శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను; అప్పుడు ముఖాముఖిగా మాటాలాడు కొనెదము. నీకు సమాధానము కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పుము.